BASANT FASHION DESIGNER

BASANT FASHION DESIGNER

BASANT FASHION DESIGNER

Thursday, December 19, 2013

LANGA లంగా-ఓణి HALF SAREE

లంగా ఓణి దక్షిణ భారతదేశంలోని స్త్రీలు ధరించే సాంప్రదాయక దుస్తులు.ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో యుక్తవయస్సులోని అవివాహితులైన స్త్రీలు ధరిస్తారు. దీనిని తమిళులు ధావనిగా పిలుస్తారు. ఓణి లేదా లంగా ఓణి లేదా పైట పావడ, అవివాహిత యువతులు ధరించే దక్షిణ భారత సాంప్రదాయిక దుస్తులు. ఓణి చీర అంత పెద్దగా ఉండదు. కాబట్టి ఇది నడుము నుండి పాదాల వరకు/ముందు వైపు సింహ భాగం, వెనుక కొంత భాగం ఆచ్ఛాదన నివ్వదు. అందుకే దీని క్రింద (లోపలి లంగా పైన) పై లంగా వేసుకొంటారు. చీర వలె దీనికి కుచ్చిళ్ళు కట్టరు. ఉదరం నుండి నడుము మీదుగా ఒకే ఒక చుట్టుగా వెళ్ళి మరల ఉదరము నుండి వక్షోజాలను కప్పుతూ భుజము పైకి వెళ్ళి మిగిలిన భాగం పైటగా వెనక్కి వెళ్తుంది. దీనిని వివాహిత స్త్రీలు ధరించరు. ఆంగ్లం లో దీనిని హాఫ్ సారీ (Half Saree) అని సంబోధిస్తారు.వాడుక సాధారణంగా పుష్పించిన తర్వాత జరిపే వేడుక లో (బాల్యం నుండి యౌవనం లోనికి అడుగు పెట్టిన సందర్భ సూచికగా) యువతి దీనిని మొదటి సారి ధరిస్తుంది. పుష్పించే వరకు బాలిక లంగా, నడుము వరకు (హుక్స్/కొండీలు వెనుక వైపు ఉండే) జాకెట్టునే ధరిస్తుంది.
దాని తర్వాత యువతులు లంగా ఓణిలను దైనందిన కార్యాలలోనే కాకుండా గుళ్ళకు, ఉత్సవాలకి, పండుగలకి, శుభకార్యాలకి (ప్రత్యేక సందర్భాలలో పట్టు వంటి ఖరీదైనవి) ధరిస్తారు. పెళ్ళి అయిన స్త్రీలు లంగా ఓణికి స్వస్తి పలికి చీరలు ఉపయోగించటం మొదలు పెడతారు. తెలుగు ఆడపడుచులు యుక్త వయస్సు రాగానె మొదటగా ఓణి ధరింప జేసె రోజుని ఒక పండుగగా జరుపుతారు. ఆ తర్వాత చీరను ధరింప జేసె రోజును కూడ ఒక ఉత్సవంగా జరుపుతారు. ప్రస్తుత కాలంలో లంగా ఓణి ధరించే ఆడపిల్లలు అసలు లేరనె చెప్పాలి. దానికి కారణం ....... పాశ్చాత్య దుస్తుల ప్రభావమో, సౌకర్య వంతమో.... మరేదో కారణమైనా లంగా ఓణి కనుమరుగైనదనే చెప్పాలి.
కాని ఈ మధ్యకాలంలో అక్కడక్కడా ప్యాషన్ పెరేడ్ లలో, సినిమాలలోను దర్శనమిస్తున్నాయి. ప్యాషన్ డిజైనర్ల కృషో, సినిమాల ప్రభావమో, నాగరికతలో మార్పో ..... కారణమేదైనా లంగా ఓణీ లకు పూర్వ వైభవము తప్పక వచ్చే చూచనలు కనిపిస్తున్నాయి. స్త్రీల వస్త్ర ధారణలో ఎన్నేన్నో మార్పులు వచ్చినా చీర కట్టులోని సౌకర్యవంతము, అందము, నిండు తనము, మరేదానిలో లేనట్టే..... లంగా ఓణీ ల నిండుతనము మరెందులోను వుండదనిపిస్తుంది. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లో దీని వాడకం ఎక్కువ.కేరళలో సాధారణంగా యువతులు లంగా ఓణిని ధరించరు.

No comments:

Post a Comment